శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): నానాక్ రామ్ గూడలో ఉన్న శ్రీ రామ్ నగర్ వాసవి జిపి ట్రైన్స్ ఏడిపి అపార్ట్మెంట్స్ సర్వీస్ రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో 18వ వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి అనగానే అభయమిచ్చే వాడని, ధైర్యం ఇచ్చేవాడని, ఆందోళనలు దూరం చేసేవాడని అన్నారు. గెలుపును అందించేవాడని, భయాన్ని దూరం చేసేవాడని తెలిపారు. అలాంటి భగవంతుడికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఏటేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న ఆలయ చైర్మన్ జె యాదవరావుని అభినందించారు.
ఆలయ చైర్మన్ యాదగిరి రావు, జక్కు నర్సింగరావు, రమేష్, సహదేవ్, మాట్లాడుతూ ఈ దేవాలయంలో అభయాంజనేయ స్వామి 18వ వార్షిక మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేరి కుటుంబ సభ్యులు, భక్తులు, వేద పండితులు, భజన మండలి సభ్యులు కళాకారులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ జక్కు యాదగిరి రావు, యాదవ్ రావు, నర్సింగ్ రావు, రమేష్, సహదేవ్, కుటుంబ సభ్యులు, పరిసరాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.