శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): డా. శోభా రాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరుగుతున్న అన్నమ నృత్యార్చనలో సుమాంజలి నాట్యాలయ శిష్య బృందం “వేదన్షి, ధనస్వి, శాన్వి, భవిష్య, నేహా, హాసిని, లిఖిత, దియాన్షి, రజని, మన్విత, మానస ” సంయుక్తంగా ” మహా గణపతిం, కొమ్మలాలా, జతి స్వరం, కృష్ణాష్టకం, గరుడ గమన, దశావతారాలు, చరణములే నమ్మితి, రామాయణ శబ్దం, మండూక శబ్దం, లలిత హారతి, శివోహం (పాట్ డాన్స్)” అనే ప్రసిద్ధ సంకీర్తనలకు తమ కూచిపూడి నృత్య ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, శోభా రాజు జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.