శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ రాంనగర్ లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం 2025 నూతన క్యాలెండర్ ను అఖిల భారత యాదవ సంఘం జాతీయ కౌన్సిల్ మెంబర్, సందన వేణి మహేంద్రనాథ్ యాదవ్ సంఘం, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆయన చేతుల మీదుగా ఘనంగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం గొర్రె కాపరుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి గొల్ల కురుమల సమస్యలు తీసుకువెళ్లి తగిన న్యాయం చేయాలని వినతి పత్రం ద్వారా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 19 శాతం ఉన్న గొల్ల కురుమలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మల్లన్న దేవాలయాలకు చైర్మన్లుగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ ధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని తిరుపతి యాదవ్, బెల్లంపల్లి మండల మంచిర్యాల జిల్లా నాయకులు పాయవేని మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్, గోపాల్ నాయకులు పాల్గొన్నారు.