శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.1,73,20,068 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను 173 మంది లబ్ధిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. కూకట్‌పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి గాంధీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, ప్రసాద్, లక్ష్మీనారాయణ, కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, ఎల్లం నాయుడు, అష్రాఫ్, పోశెట్టి గౌడ్, శ్రీహరి పాల్గొన్నారు.