శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖజాగూడలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో సమస్యలను కార్పొరేటర్ దృష్టికి ఖాజాగూడ కాలనీ వాసులు తీసుకొని రాగా ఆయన తక్షణమే స్పందించి అక్కడే ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి అధికారులతో ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. వెంటనే కొత్త భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ పనులను, సీసీ రోడ్ల నిర్మాణానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నరేంద్ర రెడ్డి, జిహెచ్ఎంసి ఏఈ రషీద్, ఎలక్ట్రికల్ ఏఈ లిఖిత, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు అరుణ్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, సంజీవ, శేఖర్, దుర్గ రామ్, సీనియర్ నాయకురాలు భారతి బాయి, నిర్మల, ఇందిరా, జిహెచ్ఎంసి వర్క్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, సూపర్వైజర్ పవన్, మహేష్ రెడ్డి, స్థానిక నేతలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.