శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్ ఇసంపల్లి జగదీష్ పటేల్ ని నవ తెలంగాణ విద్యార్థి శక్తి (NTVS) రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ సందర్భంగా జగదీష్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నవ తెలంగాణ విద్యార్థి శక్తి ఎంతగానో కృషి చేస్తోంది. ఈ బాధ్యతలు నా మీద నమ్మకంతో అప్పగించినందుకు అభిమానంతోపాటు మరింత కృషి చేయడానికి ప్రేరణ కలిగింది. అన్ని రంగాల్లో విద్యార్థులకు మద్దతు అందించేందుకు పూనుకుంటాను అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సాయి కిరణ్, అఖిల్, బన్నీ, సూరజ్, జయంత్, వరం పాల్గొన్నారు.