శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): అర్హులైన పేదలకు అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ శేరిలింగంపల్లి నాయకుడు రామకృష్ణ ఒక ప్రకటనలో కోరారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు హాజరవుతున్నారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అప్లై చేసుకుని ఇప్పటి వరకు ఇళ్లు రాని వారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.