శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో ఉన్న సెవెన్ హిల్స్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వయంగా తీసుకువచ్చారు. కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, దేవాలయం EO సత్యనారాయణ, భక్తులతో కలిసి గాంధీ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరి పై ఉంటుందని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, KRK రాజు, పోతుల రాజేందర్, శ్రీ హరి, పద్మ , సాంబ శివా రెడ్డి, అప్పిరెడ్డి, కిరణ్ కుమార్, కడియాల శివ , సుజాత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.