నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని, టీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో టీఆర్ఎస్ బస్తీ, యూత్, మహిళా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, నాయకులు లక్ష్మా రెడ్డి తో కలిసి కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రామకృష్ణ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షునిగా విష్ణు వర్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షునిగా ఉమామహేశ్వర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆనంద్ రావు, కన్వీనర్ సురేష్ నియామకం అయ్యారు. యూత్ కమిటీ అధ్యక్షునిగా సుబ్బా రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా వాలా సుజిత్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ లత, జనరల్ సెక్రటరీ శ్యామల ఎన్నికయ్యారు.