నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరించేలా చూస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని నల్లగండ్ల హుడాకాలనీ, డిఫెన్స్ కాలనీలో నెలకొన్న మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిరసనలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హుడా కాలనీలోని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో దారుణం అన్నారు. చేసేదేమి లేక కాలనీ వాసులు నిరసన తెలిపే ప్రసక్తి నెలకొందన్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా ఎమ్మెల్యే, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ డీజీఎం రాజశేఖర్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, నల్లగండ్ల హుడా కాలనీ, డిఫెన్స్ కాలనీ వాసులు సత్యనారాయణ యాదవ్, రఘుపతి రెడ్డి, పొంచి రెడ్డి, సతీష్, చంద్ర శేఖర్, మృత్యుంజయ, కృష్ణ, సుబ్బారావు, రమేష్, కిరణ్, శాస్త్రీ, దశరథ్, పావని, సులోచన, పద్మ, అరుణ, డాక్టర్ సీత, గోపాల్ రెడ్డి, పాపిరెడ్డి, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
