నమస్తే శేరిలింగంపల్లి: పేదల పెన్నిది, పేదల కోసం పోరాడిన నిరంతర శ్రామికుడు కామ్రేడ్ తాండ్ర కుమార్ సేవలను ఎప్పటకీ మరిచిపోలేమని తాండ్ర రమేష్ అన్నారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో బతుకుదెరువు కోసం పట్నం వలసొచ్చిన ఎందరికో సమీకరించి ఉద్యమాలు చేసి సొంత ఇంటి కల నెరవేర్చిన తాండ్ర కుమార్ యాదిలో ఆయన జీవిత చరిత్రను గేయాల రూపంలో రూపొందించిన వీడియో పాటల సీడీని తాండ్ర కుమార్ తనయుడు తాండ్ర రమేష్ చేతుల మీదుగా బాచుపల్లిలోని అంగారా హోటల్ లో ఆవిష్కరించారు. ఆయిదాల సునీల్ రచనలో, గడ్డం సంతోష్ గానం తో తీసుకొచ్చిన పాట తాండ్ర కుమార్ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ ఆయిదాల సునీల్, దశరథ్ నాయక్, మైదంశెట్టి రమేష్ (ప్రజా నాట్యమండలి), డప్పు రాములు, పల్లె మురళి, లసాని పవన్, తాండ్ర వేణు, కమ్మెట సురేష్, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
