నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ లో రూ. 13.50 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. మాదాపూర్ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ వర్క్స్ జీఎం రాజేశ్వర్, డీజీఎం శ్రీమన్నారాయణ, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నాయకులు సయ్యద్ గౌస్, హఫీజ్ పెట్ డివిజన్ సీనియర్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, సహదేవ్, గోపాల్ నాయక్, వాజిర్, వాటర్ వర్క్స్ మేనేజర్ ఇల్వర్తి తదితరులు పాల్గొన్నారు.