నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరమ్ (టీజీఎఫ్) ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా డాక్టర్ డి. భరత్ రాజ్ నియమితులయ్యారు. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు దొడ్ల వెంకట్ ఈ మేరకు భరత్ రాజ్ కు నియామకపు పత్రాన్ని అందజేశారు. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన భరత్ రాజ్ తెలంగాణ భారతీయ బౌద్ధ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గా, భజరంగ్ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, రంగారెడ్డి అర్బన్ బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శిగా, మహంకాళి హిందూ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. తన నియామకానికి సహకరించిన టీజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
