రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి – బిజెవైఎం డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా విధుల నుండి తొలగించిన 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం విధుల నుండి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాల‌ని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆదేశాల మేరకు బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో జిల్లా‌‌ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటన చేసి నేటికి 110 రోజులు దాటిన ఇప్పటివరకు ఆర్డర్ కాపీ అందలేదన్నారు. విధుల నుండి తొలగించి మూడు సంవత్సరాలు కావస్తున్నా 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందని సంతోషపడాలో ఆర్డర్ కాపీ రాలేదని బాధపడాలో అర్థం కానిపరిస్థితిలో ఉన్నారని వాపోయారు. బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జితేందర్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, నరేష్ చారీ, రాజు పాల్గొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి‌ తీసుకోవాలని కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసిన బిజెవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here