నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచంలోనే భారతదేశానికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రి నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బిజెపి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మహా నేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు. దేశ ప్రధానిగా ఏడేళ్ల కాలంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ఎన్నో ఆవిష్కరణలు చేసిన మహోన్నత నేత అన్నారు. సంచలనాత్మక నిర్ణయాలను తీసుకొని దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, మనోహర్, శ్రీధర్ రావు, మాణిక్ రావు, శ్రీశైలం కురుమ, రవి గౌడ్, వర ప్రసాద్, కోటేశ్వరరావు, జితేందర్, పృథ్వి కాంత్, రామయ్య, బాబు రెడ్డి, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, సిద్దు, విజేందర్, ఆంజనేయులు, అనిల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.