- లోగోను ఆవిష్కరించిన ఎంపీ రేవంత్ రెడ్డి
- ముదిరాజ్‌ల సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి వినతి
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య లోగోను మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సమాఖ్య నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/mudiraj-logo-1-1024x682.jpg)
ముదిరాజ్‌ల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమాఖ్య నాయకులు అన్నారు. ముదిరాజ్‌లకు చెందిన 17 కులాలను బీసీ డి నుంచి బీసీ ఎలోకి మార్చాలని 50 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ముదిరాజ్ సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు పంపించకుండా ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నారు. దీనిపై స్పందించాలని సమాఖ్య తరఫున కోరుతున్నామని అన్నారు.
దుబ్బాక నియోజకవర్గానికి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముదిరాజ్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరారు. అలాగే త్వరలో జరగబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ ముదిరాజ్‌లకు ఎక్కువ సీట్లు కేటాయించాలని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ ఎంపీ రేవంత్ రెడ్డిని కోరారు. ఇందుకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/mudiraj-logo-2-1024x682.jpg)
ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు నరేశ్ ముదిరాజ్, సంతోశ్ ముదిరాజ్, అనిల్ ముదిరాజ్, చిరంజీవి ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్, గోపి ముదిరాజ్, చందు ముదిరాజ్, వినోద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.