చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీలో స్థానికులతో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్ పనులకు రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని, పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే.. మరో 1-2 నెలల్లో అన్ని పనులు పూర్తవుతాయని తెలిపారు.
కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు కాలనీవాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్డులో పాత మోటార్ సైకిల్ దుకాణ దారులు వాహనాలను రోడ్లమీద పెడుతున్నారని, దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.