తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలి –  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ 

నమస్తే శేరిలింగంపల్లి:    ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ సందర్బంగా నేడు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి PJR స్టేడియం వరకు విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో జరుతున్న ఏర్పాట్లను, సభాప్రాంగణం ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం  2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ సందర్బంగా , మూడు రోజుల పాటు నిర్వహించబోయే వేడుకలను అంగరంగా వైభవంగా చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రేపు నిర్వహించే భారీ ర్యాలీలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, అనాధికారులు, పాత్రికేయ మిత్రులు, విద్యార్థులు, యువతి యువకులు, మహిళలు, తెరాస నాయకులు , కార్యకర్తలు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , శ్రేయభిలాషులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను , మౌలిక వసతులను కలిపించాలని తెలిపారు. సభాప్రాంగణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమల ఏర్పాట్లను , భోజన వసతుల పై పలు సూచనలు సలహాలు ఇచ్చామని చెప్పారు. సెప్టెంబర్ 16వ తేదీన మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి PJR స్టేడియం వరకు విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీ గా బయలుదేరుతారు. అక్కడే భోజన వసతి ఉంటుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.

PJR స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను, సభాప్రాంగణం ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డితో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

అదే రోజు మధ్యాహ్నం, హైదరాబాద్ లోని బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్దగల ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ గోండు లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ’ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, మల్లేష్ గుప్తా, కృష్ణ యాదవ్, MD ఇబ్రహీం, రమేష్, వరలక్ష్మి రెడ్డి, కార్తిక్ గౌడ్,దాస్, నరేందర్ బల్లా, యశ్వంత్ , అమిత్ దుబే, సందీప్ రెడ్డి శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ , SRP లు శ్రీనివాస్ రెడ్డి , మహేష్, కనకరాజు, బాలాజీ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here