ముఖద్వారం కాలనీ చిరునామాకు సంకేతం

  • దీప్తి శ్రీ నగర్ కాలనీ ముఖద్వారాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారంను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీలో గురువారం కాలనీ ముఖ ద్వారం ప్రాంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, కాలనీ ముఖద్వారం కాలనీ చిరునామాకు సంకేతంగా ఉపయోగపడుతుందని, దీప్తి శ్రీ నగర్ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, చందానగర్ డివిజన్ ను, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కి శాయశ క్తుల కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, MD ఇబ్రహీం, రమేష్, వరలక్ష్మి రెడ్డి, కార్తిక్ గౌడ్, దాస్ , నరేందర్ బల్లా, యశ్వంత్ , అమిత్ దుబే, సందీప్ రెడ్డి , దీప్తి శ్రీ నగర్ కాలనీ వాసులు సీతారామయ్య, పూర్ణచంద్రరావు , చంద్రశేఖర్, రాజు , సుమన్ రెడ్డి , మంగపతి , శోభాశ్రీ , రామారావు , విజయ్ కుమార్ , రాములు , రవీందర్ బాబు , శ్రీనివాస్ ,సుధాకర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

దీప్తి శ్రీ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారంను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here