రూ. 18 లక్షల 25 వేలతో స్కెటింగ్ ట్రాక్  

  • పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
  • నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని అధికారులకు ఆదేశం

చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో రూ. 18 లక్షల 25 వేల అంచనావ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న స్కెటింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ PJR స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న స్కెటింగ్ ట్రాక్ నిర్మాణ పనులను పరిశీలించమని, స్కెటింగ్ ట్రాక్ ఈ ప్రాంత ప్రజల పిల్లలకు, క్రీడాకారులకు ఎంతగానో తోడ్పడుతుందని , పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులును ఆదేశించారు. స్కెటింగ్ ట్రాక్ ను నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని హెచ్చరించారు. క్రీడల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని PJR స్టేడియంలో క్రీడాకారుల కోసం అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, PJR స్టేడియం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, మల్లేష్ గుప్తా, కృష్ణ యాదవ్, MD ఇబ్రహీం, రమేష్, వరలక్ష్మి రెడ్డి, కార్తిక్ గౌడ్, దాస్ , నరేందర్ బల్లా, యశ్వంత్ , అమిత్ దుబే, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

PJR స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న స్కెటింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here