శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్.రామచందర్ రావును పలువురు న్యాయవాదులు కలిసి సన్మానించారు. నగరంలోని తెలంగాణ బార్ కౌన్సిల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్, బీసీఐ మెంబర్ విష్ణువర్దన్ రెడ్డి, ఇతర బార్ కౌన్సిల్ సభ్యులు, అడిషనల్ సాలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, న్యాయవాదులు రామచందర్ రావుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.