శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి BHEL చౌరస్తా వరకు, సైబర్ టవర్స్ నుండి హైటెక్స్ వరకు ఇరువైపుల ప్రధాన రహదారులలో పారిశుధ్య నిర్వహణకు కేటాయించిన మొబైల్ శానిటేషన్ టీమ్స్ కు చెందిన 3 స్వచ్ ఆటోలను డీసీ మోహన్ రెడ్డి, AMOH డాక్టర్ రవి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ డ్రైవర్లకి వాహనాల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి BHEL చౌరస్తా వరకు, సైబర్ టవర్స్ నుండి హైటెక్స్ వరకు ఇరువైపుల ప్రధాన రహదారులలో పారిశుధ్య నిర్వహణకు కేటాయించిన మొబైల్ శానిటేషన్ టీమ్స్ కు చెందిన 3 స్వచ్ ఆటోలను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణకు చందానగర్ సర్కిల్ పరిధిలోని స్వచ్ ఆటోలను లబ్ధిదారులకు అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రధాన రహదారులలో ఎప్పటికప్పుడు చెత్త చెదారం తొలగించి రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సింహ గౌడ్, నర్సింహ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.