శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): జమ్ముకాశ్మీర్ లోని పహాల్గామ్ లో ఇటీవలే జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన లిబర్టీ లోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో కన్నీటి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ…ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమీషనర్లు, డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.