నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లోని శ్రీ తుల్జాభవాని దేవస్థానం ఆలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీ తుల్జాభవాని దేవస్థానానికి నియామకమైన చైర్మన్, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యవర్గ సభ్యులు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని, దేవస్థానంలో మంచి ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కలిగేలా చూడాలని తెలిపారు. దేవుడికి, భక్తులకు మధ్య సేవ చేసేలా అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, దైవ సేవలో నిమగ్నం కావాలని, భక్తులకు, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తుల్జాభవాని దేవస్థానం చైర్మన్ మల్లికార్జున శర్మ, ఆలయ కమిటీ సభ్యులు గోవిందా చారి, రాజేంద్ర కుమార్, తివారి, విజయ లక్ష్మి, కృష్ణ యాదవ్, సంపత్ గుప్త, మహేష్ గుప్త, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, రమేష్, నటరాజ్, సంజీవ్ రెడ్డి, రవి యాదవ్, గోపి కృష్ణ, కవిత తదితరులు పాల్గొన్నారు.
