సోమేశ్వరాలయ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేద్దాం – కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం లో ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి నల్లగండ్ల గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులతో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు, ఆలయ కమిటీ సభ్యులు వసంత్ కుమార్ యాదవ్, మైలారం నరేందర్ గౌడ్, ఆకుల యాదగిరి, ముత్యాల రవీందర్, పనేటి రమేష్, కాలకంటి రాధ, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు జంగయ్య యాదవ్, సత్యనారాయణ, సురేందర్, పద్మారావు, వినోద్, మల్లేష్, పొడుగు రాంబాబు, శంకరి రాజు ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, నటరాజ్ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న సోమేశ్వరాలయ కమిటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here