తారాన‌గ‌ర్ రేహాన్‌ జ్యూవేల‌ర్స్‌ చోరి కేసును చేధించిన చందాన‌గ‌ర్ పోలీసులు… ఘ‌రానా దొంగ బిరియాని పాషా అరెస్ట్‌…

  • మూడున్న‌ర‌ తులాల బంగారం, 10 కిలోల వెండి, 4 కార్లు, పెద్దమొత్తంలో విలువైన సిగ‌రేట్ బాక్సులు స్వాదీనం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చందాన‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే చోరీ కేసులో పీడీ యాక్ట్‌లో జైలు శిక్ష అనుభ‌వించిన నిందితుడు బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌ల్లీ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతు మరోసారి పోలీసులకు చిక్కాడు. చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్లు క్యాస్ట్రో, మ‌హేష్‌గౌడ్‌లు వివ‌రాలు వెళ్ల‌డించారు. నాగర్ క‌ర్నూల్ జిల్లా రామ్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహబూబ్ పాషా అలియాస్ బిరియాని పాషా(39) స్థానికంగా డ్రైవ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తుంటాడు. ఇద్ద‌రు భార్యలు, ఎడుగురు సంతానం క‌లిగిన  పాషా మంచి జ‌ల్సారాయుడు.

నిందితుడి వివ‌రాలు వెళ్ల‌డిస్తున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్లు క్యాస్ట్రో, మ‌హేష్‌గౌడ్‌

జ్యూవేల‌రీ షాపులు, ఇత‌ర వ్యాపార కేంద్ర‌ల‌ను టార్గెట్ చేస్తూ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలోనే వనపర్తి, బిజినేపల్లి, జడ్చెర్ల, మహబూబ్‌నగర్‌, సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల ప‌రిదిలో అనేక దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ్డాడు. గ‌తంలో ఇత‌ను పీడీ యాక్టుల కింద జైలుకు వెళ్లాడు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత తీరు మార్చుకోని బిరియాని పాషా తిరిగి చోరీల‌కు పాల్ప‌డుతూనే ఉన్నాడు. ఇదే క్ర‌మంలో ఈ నెల 8న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని తారాన‌గ‌ర్ రేేేేహాన్న జ్యూవేలరీ షాప్ కు క‌న్నంవేశాడు. అక్క‌డి నుంచి పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌తో పాటు న‌గ‌దును దోచుకెళ్లాడు.

నిందితుడి నుంచి పోలీసులు స్వాదీనం చేసుకున్న బంగారు, వెండి ఆభ‌రణాలు

కాగా షాపు య‌జ‌మాని ప‌ర్వీన్ భేగం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఐతే మంగ‌ళ‌వారం ఉద‌యం గుల్‌మోహ‌ర్‌పార్క్ వ‌ద్ద వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా బిరియాని పాషా అనుమానాస్ప‌ద స్థితిలో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో తీగ లాగ‌గా ఢొంకంతా క‌దిలింది. అత‌ని వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, రూ.35 వేల న‌గ‌దు, 4 కార్లు, ఖరీదైన సిగరెట్ ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. చోరి కేసును చేధించ‌డంలో ప్ర‌త్యేకంగా చొర‌వ చూపిన ఇన్‌స్పెక్ట‌ర్లు క్యాస్ట్రో, మ‌హేష్ గౌడ్ బృందాన్ని డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌త్యేకంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here