కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానా సూపరింటెండెంట్‌గా వ‌ర‌దాచారి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానాలో నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ వరదాచారి భాద్య‌త‌లు చేప‌ట్టారు. అదే దవఖానాలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వ‌హిస్తున్న వ‌ర‌దాచారికి సూప‌రింటెండెంట్‌గా భాద్య‌త‌లు అప్ప‌గిస్తూ వైద్య‌శాఖ ఉత్త‌ర్వులు జారి చేసింది. ఇక్క‌డ‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్న డాక్టర్ దశరథ్ తన పదవికి రాజీనామా చేయగా ఆయ‌న‌ స్థానంలో వరదచారికి అవకాశం ద‌క్కింది. ఐతే ద‌శరథ్ ఇక‌పై ఇదే దవాఖానాలో అనస్తీషియా వైద్యునిగా కొనసాగ‌నున్నారు.ఐతే ఇటీవ‌ల కొండాపూర్ జిల్లా ద‌వాఖానాలో భారీమొత్తంలో కోవిషీల్డ్ వ్యాక్సీన్ చోరికి గురైన నేప‌థ్యంలో తాజా మార్పుల ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా ద‌వాఖానా సూప‌రింటెండెంట్ వ‌ర‌దాచారీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here