నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జీహెచ్ఎంసీ కొత్తగా ఉచిత అంతిమ యాత్ర సేవలను ప్రారంభించింది. కరోనాతో మృతి చెంది కనీసం స్మశాన వాటికల వరకు మృతదేహాలను తరలించుకోలేని దుస్థితిలో ఎంతో మంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికోసం జీహెచ్ఎంసి ఉచిత అంతమ యాత్ర సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం, యూసుఫ్‌గూడ సర్కిల్స్‌కు చెందిన వారు కొవిడ్‌తో మృతిచెందినా, ఇతర అనారోగ్యాలు, సాదారణంగా మృతిచెందినా ఈ సౌకర్యాలను పొందవచ్చని శేరిలింగంపల్లి జోనల్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, సూపరెంటెండెంట్ రమేష్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతిమ యాత్ర సేవలు పొందాలనుకునే వారు ఫోన్ నెంబర్లు 6309529286(మల్లారెడ్డి), 9989930253(రమేష్)లలో సంప్రదించాలని సూచించారు. తమకు సమాచారం అందిన వెంటనే అంతిమ యాత్ర వాహనం మృతుడి ఇంటి వద్దకు, లేదా వారు చికిత్స పొందిన హాస్పిటల్‌కు పంపించడం జరుగుతుందని, జోన్ పరిధిలోని నిరుపేదలు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐతే మృతదేహాన్ని స్థానిక స్మశానవాటికలకు చేర్చడం వరకే తమ భాద్యత అని, అక్కడ అంత్యక్రియలు మృతుడి సంబంధీకులు చూసుకోవాలని సూచించారు.