నమస్తే శేరిలింగంపల్లి: ఆషాడ బోనాల పండుగను పురస్కరించుకుని సోమవారం తారానగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపులో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.యూత్ సభ్యులు హాజరైన అతిథులకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనార్ధన్ గౌడ్, యూత్ నాయకులు ప్రసాద్, శ్రావణ్, ప్రవీణ్ రెడ్డి, సురేందర్, హరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
