నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సగరుల డిమాండ్ల సాధనలో భాగంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని సోమవారం కలిశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుల బృందం రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది సగరుల ప్రధాన సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సహకరించాలని కోరుతూ రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అందుకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సగర సంఘం చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సగరుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షులు ఎం. రాములు సగర, ప్రచార కార్యదర్శి రవికుమార్ సగర, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర నాయకులు వేముల వెంకటయ్య సగర, బూపేష్ సగర, మారయ్య సగర, చీర్ల జనార్ధన్ సగర, గ్రేటర్ సంఘం నాయకులు సంతోష్ సగర, శ్రీరాములు సగర, లక్ష్మయ్య సగర, శేఖర్ సగర, గోవింద్ సగర, ఎ.కృష్ణ సగర, చన్నయ్య సగర, గ్రేటర్ పరిధిలోని ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు గంగాధర్ సగర, ఆంజనేయులు సగర, బాల్ రాజ్ సగర, రవి సగర, యూత్ సగర సంఘం నాయకులు సీతారాం సగర, రాజు సగర, అరుణ్ సగర, నాయకులు ఉన్నారు.