కిండర్ గార్డెన్ లో హెచ్ టీ సీ నారాయణ‌ చిన్నారుల హావా..

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సూచనల మేరకు నారాయణ విద్యా సంస్థలు కరోనా నియమనిబంధనలు పాటిస్తూ ఆన్ లైన్ తరగతుల ద్వారా చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. అందులో భాగంగానే శేరిలింగంపల్లి ‌హుడా ట్రేడ్ సెంటర్ లోని నారాయణ విద్యా సంస్థకు చెందిన పలువురు చిన్నారులు చక్కటి ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని నారాయ‌ణ విద్యా సంస్థలు కిండర్ గార్టెన్ విభాగంలో చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా వివిధ వేషధారణలో చక్కటి కథనాలతో స్టొరీనేరషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఆయా ప్రాంతాల నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్స్ , సెంట్రల్ బ్రాంచ్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. వీటిలో హుడా ట్రేడ్ సెంటర్ నారాయణ విద్యా సంస్థ చిన్నారులు ఆన్ లైన్ లోనే ఆకట్టుకునే వేషాధారణతో తమ‌ ప్రతిభను చాటారు. చక్కటి ప్రతిభను కనబరచినందుకు గాను విద్యార్థులను, ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు విద్య సంస్థల ఏ .జి .ఎమ్ వేణుగొపాల్ రావు అభినందించారు.

ఆన్ లైన్ ద్వారా కిండర్ గార్డెన్ లో ప్రతిభను చాటిన నారాయణ విద్యా సంస్థ చిన్నారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here