శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కాలనీలో ఉన్న సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి BHEL చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాలా వరకు నాలా విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను,RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, SNDP విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని, ఒకప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇబ్బందులకు గురయ్యేవారు అని అన్నారు. కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నాలాల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో SNDP అధికారులు DE ధీరజ్, AE నిఖిల్ యుగేందర్, పవన్, నాయకులు , కార్యకర్తలు, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.