పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజిద్దాం : కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించాలని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వార్డ్ కార్యాలయంలో బుధవారం మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో కుల వృత్తులపై ఆధారపడిన కుమ్మరులకు కరోనా నేపథ్యంలో ఎంతో సహకారం అందుతుందని అన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, శాంతయ్య, రామకృష్ణ గౌడ్, భగత్, శ్రీనివాస్, పద్మ రావు, జ్ఞానేశ్వర్, వెంకటేష్ ముదిరాజ్, దేవేందర్, సాబేర్, ఉమేష్,రవి,ముజీబ్,శ్రావణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయక ప్రతిమలను అందజేస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here