శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): CM కప్ 2024 లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ 2024 స్విమింగ్ మొదటి రోజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి, , తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ అసోసియేషన్ స్విమింగ్ సెక్రెటరీ ఉమేష్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ CM కప్ 2024 లో భాగంగా తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విమింగ్ పోటీలు నిర్వహించడం చాలా అభినందనియం అని , స్విమ్మింగ్ మంచి వ్యాయమం అని ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.