శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకుల భరణం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు ఓబీసీల రాజకీయ అప్రాప్తత కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ సభలో ఓబీసీల చారిత్రక విస్మరణను ప్రస్తావించామని, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఓబీసీలను పూర్తిగా పక్కన పెట్టడం, వారి హక్కులు, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయంపై దాని ప్రభావం గురించి చర్చించామని తెలిపారు. ఓబీసీలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఓబీసీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కిరణ్, ఓ బి సి ఫ్రంట్ మహిళా విభాగం వసుమతి యాదవ్, వనపర్తి జిల్లా మధు యాదవ్, కృష్ణ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, మున్నూరు కాపు సంఘం రాఘవేంద్ర, వడ్డెర సంఘం నాయకులు రాజు, రజక సంఘం నాయకులు అశోక్, నాయి బ్రాహ్మణ సంఘం, రజక సంఘం నాయకులు రాములు, ఈశ్వరయ్య, కుమ్మరి సంఘం నాయకులు కృష్ణయ్య, మ్యాదరి మహేంద్ర సంఘం నాయకులు నాగభూషణం పాల్గొన్నారు.