శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామం లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ముగిసింది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కథక్, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ప్రముఖ నాట్య గురువు సంజయ్ జోషి శిష్య బృందం కృష్ణ థాట్ ,కృష్ణ వందన, వసంత్ రాస్, సూరదాస్ భజన, తరణ, తాల్ తీన్ తాల్ మొదలైన అంశాలను జయ్ జోషి, అనుష్క, ఆత్రయీ, నేహా, ప్రేమ, ఆర్య, అదితి,మధుమిత లు ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నాట్య గురువు బిందు అభినయ్ శిష్య బృందం మోదమున, జతిస్వరం, ఆనంద తాండవం, ఝేమ్ ఝేమ్ తనన, రామాయణ శబ్దం, మండూక శబ్దం, తక్కువేమి మనకు అంశాలను యామిని, గార్గేయీ, జగతి, మోక్ష, ఉదయశ్రీ, రజిత, ప్రీతీ, శ్రీహిత,మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.