మాదాపూర్, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో హఫీజ్ పేట్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ గ్రామంలో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కాయదమ్మకుంటపై స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, శ్రీశైలం కురుమ, ఆకుల లక్ష్మణ్, పవన్, శ్రీనివాస్, దేవేందర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.