శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న భక్తులు, మండపాల నిర్వహకులకు సైబరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేశారు. మండపాల వద్ద ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ క్రమంలో మండపాలను ఏర్పాటు చేయదలచిన వారు https://policeportal.tspolice.gov.in/index.htm అనే లింక్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ వెబ్‌సైట్‌లో మండపాల నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేసుకుని జియో ట్యాగ్ చేసుకోవాలని అన్నారు.