అన్న‌మ‌య్య‌పురంలో ద‌స‌రా ఉత్స‌వాలు

మాదాపూర్‌, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నాదబ్రహ్మోత్సవ్- 2024ను నిర్వహించనున్నారు. అన్నమాచార్య భావనా వాహిని ఈ ఏడాది ధైర్య అవార్డును శంకరాభరణం చిత్రనటి మంజుభార్గవికి బహూకరించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖ కళాకారుల‌చే అన్నమాచార్య సంకీర్తనలతో నాద నైవేద్యం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు. ఇందులో అంద‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here