నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ఎస్ వి కె ప్రసాద్ వర్ధంతిని శనివారం సీఆర్ ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు డి. ప్రేమ్ పావని మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో కామ్రేడ్ ఎస్ వి కె ప్రసాద్ చేసిన త్యాగాలు మరవలేనివని అన్నారు. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు వదులుకొని కమ్యూనిస్ట్ పార్టీ కి అంకితమయై పని చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం లో అనేక సంవత్సరాల పాటు జైలు జీవితం, రహస్య జీవితం గడిపారు అని చెప్పారు.సాయుధ పోరాటం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసారని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ల ఐక్యత కోసం చాలా కృషి చేసారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్ వి కె ప్రసాద్ సతీమణి కామ్రేడ్ సుగుణమ్మ, డాక్టర్ రజిని, పరుచూరి జమున, సీపీఎం నాయకులు శోభన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.