సురభి కాలనీలో‌ పట్టణ ప్రగతి… మొక్కలు నాటిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి:పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని‌ శేరిలింగంపల్లి డివిజన్ ‌పరిధిలోని‌ సురభి కాలనీలో‌ శుక్రవారం నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని‌ మొక్కలు నాటారు. శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమం లో సురభి కాలనీలో కాలనీవాసులు, నాయకులు, పార్టీ కార్యకర్త లతో కలిసి మొక్కలను నాటారు. చైల్డ్ ఫౌండేషన్‌ సంస్థ వారు అందజేసిన శానిటేషన్ ‌కిట్స్‌ను‌‌‌ పారిశుద్ద్య సిబ్బందికి రాగం నాగేందర్ యాదవ్ ‌అందజేశారు. సురభి కాలనీ ప్రభుత్వ పాఠశాలకు చేతులు‌ కడుక్కునే యంత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫౌండేషన్ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీశైలం, హెల్త్ కోఆర్డినేటర్ దివ్య, రేబాక, నాగమణి, వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజ్, నాయకులు బసవయ్య, కొండల్ రెడ్డి, చిరంజీవి, ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జయవర్ధన్, సాయి శ్రీకర్, రమేష్, రాజారామ్, ప్రశాంత్, నరేందర్, వెంకటేశ్వర్లు, ఖమ్మం వెంకటేశ్వర్లు, పవన్, సబియబేగేమ్, కల్యాణి, వాణి, రోజా, రాజు, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, డి శ్రీకాంత్, మహేందర్ సింగ్,రాజు, సుధాకర్ రెడ్డి, రాజకుమార్, రాంచందర్, సాయి, జమ్మయ్య, పటోళ్ల నరసింహ, రాకేష్, సాయి, వినయ్,సత్తార్, ఏఈ సునీల్, వర్క్ ఇన్ స్పెక్టర్లు మహేష్, యాదగిరి, ఎస్ ఆర్ పీ‌ భరత్ తదితరులు పాల్గొన్నారు.

చేతులు‌ శుభ్రం చేసుకున్న యంత్రాన్ని అందజేస్తున్న కార్పొరేటర్ రాగం ‌నాగేందర్‌ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here