మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు వెంటనే సహాయం అందించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు ప్రసాద్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని వరద బాధితులు తమకు సహాయం అందించాలని ఆయనను కోరగా.. అందుకు ప్రసాద్ స్పందిస్తూ డీసీ సుధాంష్‌కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవాలని డీసీని కోరామని తెలిపారు. బాధిత ప్రజలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు.

