చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలోనూ సీసీ రోడ్లు నిర్మిస్తామని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని చందానగర్ లో రూ.4 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గౌస్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆమె వెంట ఉన్నారు.