బిజెపి నాయకులను విమర్శించే అర్హత టిఆర్ఎస్ కార్యకర్తలకు లేదు: శివకుమార్

శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు శివకుమార్

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను విమర్శించే అర్హత టిఆర్ఎస్ కార్యకర్తలకు లేదని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు శివ కుమార్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ లపై శేరిలింగంపల్లి టిఆర్ఎస్ నాయకుడు కలి వేముల వీరేశం గౌడ్ చేసిన వ్యాఖ్యలను శివ కుమార్ ఖండించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధిస్తామని మీసాలు మెలేసిన టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ఓటమిని అంగీకరించక తప్పలేదన్నారు. ఎన్నికలకు టిఆర్ఎస్ తరపున నాయకత్వం వహించిన హరీష్ రావు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మిన్నకుండి పోయారని, ఇటువంటి సందర్భంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అవాకులు చవాకులు పేల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులను విమర్శించే స్థాయి టిఆర్ఎస్ కార్యకర్తలకు లేదని హద్దుల్లో ఉండి మాట్లాడాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here