చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆదరిస్తే, చందానగర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా మారుస్తానని డివిజన్ తెరాస అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ వీకర్ సెక్షన్, వేమన (రెడ్డి)కాలనీ, గౌతమి నగర్ కాలనీలలో శుక్రవారం మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దమ్మ దేవాలయంలో మంజుల రఘునాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఏ కాలనీకి వెళ్ళినా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలకు ఆర్థిక భారం పడకూడదని 50 శాతం ఇంటి పన్ను రాయితీ కల్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి ఆగం కావద్దని ఆమె అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. వరద సాయం అందని బాధితులకు, డిసెంబర్ 4 తర్వాత వారికి తప్పకుండా వరద సాయం అందజేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో గురుచరణ్ దూబే, ఉరిటి వెంకటరావు, ఓ.వేంకటేష్ రాజు, ధనలక్ష్మి,
లక్ష్మినారాయణ గౌడ్,ల క్ష్మారెడ్డి, యాదగిరి గౌడ్, రాంచందర్, కరుణాకర్ గౌడ్, రఘుపతి రెడ్డి, మిర్యాల రాఘవరావు, సునీత రెడ్డి, అక్బర్, అంజద్, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
