అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు తెరాస‌కే : రాగం నాగేంద‌ర్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ముస్లిం మైనార్టీలంతా టీఆర్ఎస్ పార్టీకే పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్య‌ర్థి రాగం నాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని తారాన‌గ‌ర్‌లో ఆయ‌న శుక్ర‌వారం పాద‌యాత్ర నిర్వ‌హించారు. కారు గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కారు గుర్తుకు ఓటేసి ప్ర‌జ‌లు రెండోసారి త‌మను ఆశీర్వ‌దించాల‌ని అన్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాల‌ని ముస్లిం మైనార్టీల‌ను కోరుతున్న రాగం నాగేంద‌ర్ యాద‌వ్

ఈ ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, వార్డు మెంబర్ కవితాగోపి, తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్, లింగంపల్లి గ్రామ గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, సీనియర్ నాయకులు హబీబ్, నిజాం, గోవింద్ చారి, సలీం, రహీం, అహ్మద్, మజర్, లతీఫ్‌, ముస్తాక్, అల్తాఫ్, కిరణ్, బీమని శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here