తెరాస‌లో చేరిన వ్యాపార‌వేత్త ల‌లిత రెడ్డి

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని సుర‌క్ష కాల‌నీకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త లెక్క‌ల ల‌లిత రెడ్డి తెరాస నాయ‌కుడు మిద్దెల మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ స‌మ‌క్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ల‌లిత రెడ్డికి గాంధీ తెరాస కండువాను క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ల‌లిత రెడ్డి మాట్లాడుతూ.. చందాన‌గ‌ర్ డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి మంజుల ర‌ఘునాథ్ రెడ్డి గెలుపుకు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేస్తాన‌ని తెలిపారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపిస్తామ‌ని అన్నారు.

ల‌లిత రెడ్డికి తెరాస కండువా క‌ప్పుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, చిత్రంలో మిద్దెల మ‌ల్లారెడ్డి
తెరాస‌లో చేరిన ల‌లిత రెడ్డితో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, మిద్దెల మ‌ల్లారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here