నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి శనివారం బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వాడవాడల పాదయాత్ర చేస్తూ సమస్యలపై ఆరాతీశారు. ప్రధానంగా డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల తదితర సమస్యల తీవ్రతను రాయదుర్గం వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన గంగాధర్ రెడ్డి సదరు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృహి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో మాట్లాడి స్థానిక పరిస్థితులను వివరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, స్వామి గౌడ్, మూల అనిల్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, నీరుడి సురేష్, సతీష్ గౌడ్, దయాకర్, వెంకటేష్, విజయ్, శ్యామ్ యాదవ్, రాము యాదవ్, శ్యామ్లెట్ రాజు, వరలక్ష్మి, ఇందిర, దుర్గారామ్, అమర్ యాదవ్, రాఘవేంద్రలు తదితరులు పాల్గొన్నారు.