నమస్తే శేరిలింగంపల్లి: కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌పై శేరిలింగంపల్లిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డిలు సమావేశమై సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విధివిధానాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకే సెంటర్‌లో వ్యాక్సిన్ కార్యక్రమం చేపడితే ఇబ్బందులు ఏర్పడుతాయని, ఈ క్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో 2 సెంటర్లు, చందానగర్ సర్కిల్ పరిధిలో 2 సెంటర్లు కుకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లలో 1 సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు గాంధీ సూచించారు. ప్రభుత్వ విప్ గాంధీ గారు కోరినారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ కేంద్రాలలో అన్ని రకాల వసతులు మరియు కోవిడ్ నిబంధనలు పాటించాలని , టీకా కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, సూపర్ స్ప్రేడర్స్ను గుర్తించి వారికి ప్రత్యేక కూపన్లు అందించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు సూచించారు. అదేవిధంగా వ్యాక్సిన్ అందుకోబోయే సూపర్ స్ప్రేడర్స్ ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయలు, పూలు, పళ్ళు అమ్మేవాళ్ళు, చికెన్, మటన్ షాపుల్లో పని చేసే వారితో పాటు కిరాణా, బార్బర్ షాపుల్లో పని చేసేవారికి, గ్యాస్, పెట్రోల్ డీలర్ల సిబ్బంది, చౌక ధరల దుకాణాల డీలర్లు, లిక్కర్ షాప్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.