- సేవలను ప్రారంభించిన ట్రస్టు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విజృంభిస్తున్న వేళ శేరిలింగంపల్లిలోని నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు ఎం.భిక్షపతి యాదవ్, కార్యదర్శి ఎం.రవికుమార్ యాదవ్‌లు మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నిరుపేదల ఆరోగ్య రక్షణకోసం తమ సొంత నిధులతో తోచిన సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ, అంబులెన్స్, ఉచితంగా మందుల పంపిణీ తదితర సర్వీసులను అందించనున్నట్టు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కాల్ సెంటర్ 79016 29623కు ఫోన్ చేస్తే రోగి పరిస్థితిని అర్ధం చేసుకుని వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారని, వైద్యుల సూచనల ప్రకారం బాదితుల ఇంటికి వెళ్లి తమ సిబ్బంది ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. రోగి పరిస్థతి ఆందోళన కరంగా అనిపిస్తే వెంటనే వారిని ఆర్‌కేవై ప్రాణహేతు(అంబులెన్స్) ద్వారా సమీప దవాఖానాలకు ఉచితంగా తరలిస్తామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేదలు సందయ్య మెమోరియల్ ట్రస్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రవీణ్, నాగేష్, నాయకులు రాధకృష్ణ యాదవ్, ఎల్లేష్, బాల కుమార్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.